Фильтр публикаций






శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

శివానందలహరి – శ్లోకం – 37

ఆమ్నాయామ్బుధిమాదరేణ సుమనస్సంఘాః సముద్యన్మనో
మన్థానం దృఢభక్తిరజ్జుసహితం కృత్వా మథిత్వా తతః |

సోమం కల్పతరుం సుపర్వసురభిం చిన్తామణిం ధీమతాం
నిత్యానన్దసుధాం నిరన్తరరమాసౌభాగ్యమాతన్వతే ||

మంచిమనస్సుకలవారు సకలగుణసంపత్తిగల మనస్సును కవ్వముగా చేసి దృఢభక్తి అనే త్రాటితో కట్టి, వేదసముద్రమును ఆసక్తితో మథించుటద్వారా కల్పవృక్షము, కామధేనువు, చింతామణులకు సమానమైనవాడూ, బుద్ధిమంతులకు ప్రియమైన నిత్యానందమగు అమృతస్వరూపుడూ, మోక్షలక్ష్మీస్వరూపుడూ, ఉమా సహితుడూ అయిన శివుని పొందుచున్నారు.
































శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

శివానందలహరి – శ్లోకం – 36

భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః
కుమ్భే సామ్బ తవాఙ్ఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలమ్ |

సత్వం మన్త్రముదీరయన్నిజశరీరాగారశుద్ధిం వహన్
పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కల్యాణమాపాదయన్ ||

సాంబశివా! భక్తుడనైన నేను నా మనోభీష్టమైన కళ్యాణము (శుభము, మంగళము) పొందుటకు,
ఈ శరీరమనే గృహము శుద్ధి కొరకై..

నా మనస్సనే కలశమును భక్తి అనే దారముతో చుట్టి, సంతోషము అనే ఉదకముతో నింపి, ప్రసన్నమైన ఈ కలశమునందు నీ పాదములనే చిగురుటాకులను, జ్ఞానమను నారికేళమును ఉంచి, శివమంత్రమును ఉచ్చరించుచూ పుణ్యాహవచనము చేయుచున్నాను.



Показано 20 последних публикаций.
OSZAR »